నిద్రిస్తున్న అన్నపై తమ్ముడి దాడి

AP: కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం కొత్తూరుకు చెందిన వజ్రాల సుబ్బరాయుడుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వెంకటసుబ్బయ్య, చిన్న కుమారుడు సురేష్. ఇద్దరూ మద్యానికి బానిస కావడంతో ఇద్దరు భార్యలు వదిలివేశారు. వెంకటసుబ్బయ్య ఇంట్లో నిద్రిస్తుండగా, మద్యం మత్తులో ఉన్న సురేష్ గొడ్డలితో అతడి తలపై దాడిచేశాడు. అనంతరం బయటకు వెళ్లి కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి మరోసారి దాడి చేయడంతో తీవ్ర గాయాలతో వెంకటసుబ్బయ్య మృతి చెందాడు. SI శివప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



