← Back to news

ట్యాంకర్లతో వరి నారుకు నీరు

By DK· 16 Jul 2026· మహబూబాబాద్ జిల్లా

TG: ఎల్‌నినో ఎఫెక్ట్, రాష్ట్రంలో ఎండలు దంచికొడుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చి పంటలను కాపాడుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామంలో రైతు బాలకృష్ణ తన వరి నారును బతికించడం కోసం ట్యాంకర్లతో పారిస్తున్నాడు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాటేందుకు సిద్ధం చేసిన వరి నారు ఎండిపోకుండా ఉండేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి పోస్తూ పంటను కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు.

More in TG