తెరిచి ఉన్న డ్రైన్‌లో పడిన చిన్నారి
కర్ణాటకలోని సుళ్లియ తాలూకా శ్రీరామపేటలో ఓ చిన్నారి తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. ముళీయ జ్యువెలర్స్ సమీపంలో వాటర్ పైప్‌లైన్ పనులు JCBతో జరుగుతున్నాయి. పనుల్లో భాగంగా ఫుట్‌పాత్‌ను తవ్వి, డ్రైనేజీ మూతను తెరిచి ఉంచారు. కుటుంబంతో వెళ్తున్న చిన్నారి ప్రమాదవశాత్తూ డ్రైన్‌లో పడిపోయింది. వెంటనే స్థానికులు బయటకు తీశారు. అదృష్టవశాత్తు తీవ్ర గాయాలు కాలేదు. బారికేడ్లు, సేఫ్టీ ఏర్పాట్లు లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

