← Back to news

చివరి క్షణంలో ప్రాణాలను కాపాడుకున్న బాలుడు

By sahani· 3 Apr 2026· Telugu Report· Madhya pradesh

ఇండోర్‌లోని శాంతి నికేతన్ కాలనీలో బాంబే హాస్పిటల్ వెనుక కాలనీ రోడ్డుపై ఒక బాలుడు ఆడుకుంటున్నాడు. అంతలోనే సంజయ్ అగర్వాల్‌కు చెందిన కారు ఒక్కసారిగా బాలుడి పైకి దూసుకెళ్లింది. కారు బాలుడి మీదుగా వెళ్లినప్పటికీ, అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారు యజమాని. గాయపడ్డ బాలుడిని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. పరీక్షించిన డాక్టర్స్ బాలుడికి ఎలాంటి ప్రమాదం లేదని, కాలు విరిగినట్లు వైద్యులు చెప్పారు. ప్రమాదానికి కారణమైన తన డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించారు.

More in Health