← Back to news

క్షుద్రపూజల ఆరోపణలపై హరీశ్‌రావు మాస్ వార్నింగ్

By dk· 6 Aug 2026
క్షుద్రపూజల ఆరోపణలపై హరీశ్‌రావు మాస్ వార్నింగ్

TG: BRS నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుపై కాంగ్రెస్ నేతలు చేసిన క్షుద్రపూజల ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో వర్షాలు పడకుండా తాను క్షుద్రపూజలు చేశానని ఆరోపించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలకు హద్దులు ఉండాలని, నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇప్పటికే సంబంధిత కాంగ్రెస్ నేతలకు న్యాయ నోటీసులు పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అంశాలను తాము ప్రశ్నిస్తున్నందుకే తనపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

More in Politics