సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ను పరిశీలించిన మంత్రి

భారీ వర్షాలతో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వరద పరిస్థితిని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పరిశీలించారు. సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి వరద నీరు చేరడంతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల్లో దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు, పంట పొలాలు, ఇళ్లను ఆమె పరిశీలించారు. వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.



