మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు

AP: బార్, వైన్స్ షాపుల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై తాడేపల్లి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో బార్, వైన్స్ షాపుల యాజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఐ వీరేంద్ర పర్యవేక్షణలో ఎస్సై ఖాజావలి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పనిచేసేలా చూడాలని సూచించారు. షాపుల వద్ద గొడవలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

