పానీపూరీతో 13 అడుగుల గణేశుడు!

పుణేలో వినాయక చవితి సందర్భంగా పానీపూరీలతో ఏకంగా 13 అడుగుల గణేశుడి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ ప్రత్యేక విగ్రహం కోసం సుమారు 21 వేల పానీపూరీలను ఉపయోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. పానీపూరీలతో గణేశుడి విగ్రహాన్ని తయారు చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలు SMలో వైరల్‌గా మారాయి.
