← Back to news

మండల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

By NRPT· 19h ago· Mulugu
మండల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో SFI, DYFI ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి కబడ్డీ పోటీలను SFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐక్యత, పోరాట స్ఫూర్తిని పెంచుతాయని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

More in Local