← Back to news

ఎల్నినో ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ఎండల సెగ!

By Anusha· 7h ago
ఎల్నినో ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ఎండల సెగ!

TG: ఎల్నినో ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లో వానలు తగ్గిపోయాయి. అక్టోబర్ 11 నాటికి హైదరాబాద్‌లో 33%, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 37%, రంగారెడ్డి జిల్లాలో 22% తక్కువ వర్షపాతం నమోదైంది. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. మూడు రోజులుగా మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రాత్రిపూట కూడా ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వానలు లేక, వేడి పెరగడంతో నగరవాసులు అల్లాడుతున్నారు. బయటకు వెళ్లాలంటేనే ఎండ భయపెడుతోంది.

More in TG