తిరంగాతో గాంధీ మునిమనవడి పాదయాత్ర

మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ ముంబైలో వ్యక్తిగత సత్యాగ్రహానికి సిద్ధమయ్యారు. నవంబర్ 1న సాయంత్రం 4 గంటలకు తిరంగా, రాజ్యాంగంతో పాదయాత్ర చేపట్టనున్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఫిరోజ్షా మెహతా విగ్రహం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర.. హుతాత్మా చౌక్, అంబేద్కర్, నెహ్రూ విగ్రహాల నుండి మంత్రాలయం పక్కన ఉన్న బాపు విగ్రహం వరకు సాగనుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల కమిషనర్పై నిరసనల ఉండటంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

