కుప్పగండ్లలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన ర్యాలీ
మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో వెల్దండ మండలంలోని కుప్పగండ్ల గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన ర్యాలీ చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఫ్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మాజీ సర్పంచ్ మొక్తల శేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ 420 హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


