← Back to news

ముస్తాబవుతున్న గణపతి విగ్రహాలు

By srikanth· 22 Aug 2026· Narsampet (Ct), Narsampet, Warangal

నర్సంపేట పట్టణంలో వినాయక చవితి సందడి మొదలైంది. వచ్చే నెల గణపతి చతుర్థి పండగ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న గణపయ్య విగ్రహాలు ముస్తాబవుతున్నాయి. కళాకారులు విగ్రహాలకు తుదిమెరుగులు దిద్దుతూ రంగులు అద్దుతున్నారు. ఇప్పటికే భక్తులు విగ్రహాల ఎంపికపై ఆసక్తి చూపుతున్నారు. పండగ సమీపిస్తున్న కొద్దీ పట్టణంలో వినాయక మండపాల ఏర్పాట్లు, అలంకరణలు ఊపందుకోనున్నాయి. దీంతో పట్టణంలో పండగ వాతావరణం నెలకొంటోంది.

More in Local