← Back to news

హర్మూజ్ లో మళ్లీ టెన్షన్ టెన్షన్

By aravinda nyayapati· 13 Apr 2026· Telugu Report· Hyderabad
హర్మూజ్ లో మళ్లీ టెన్షన్ టెన్షన్

అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం పెరిగిపోతోంది. నివురు గప్పిన నిప్పులా పరిస్థితులు మారిపోయాయి. హర్మూజ్ జలసంధిని దిగ్భంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇండియన్ టైమ్ ప్రకారం సోమవారం సాయంత్రం నుంచి హార్మూజ్ లో నౌకల్ని కదలనివ్వమని చెప్పారు. దీనికి ఇరాన్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ వ్యంగ్యంగా స్పందించారు. ఒక గణిత సూత్రాన్ని f(f(O))>f(O)' ఎక్స్ లో పోస్టు చేశారు. దీని మీనింగ్ ఏంటంటే హార్మూజ్లో అడ్డంకులు సృష్టిస్తే పెట్రోల్ రేట్లు రెట్టింపు పెరిగిపోతాయని అప్పుడు అమెరికన్లకే కష్టాలని అన్నారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ కలసికట్టుగా ఇరాన్ పై దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

More in World