గాజా పీస్ ప్లాన్ ఒకవైపు.. గ్రౌండ్‌లో అటాక్స్ మరోవైపు!

పీస్ డీల్ ముందుకు వెళ్తోందంటున్నారు.. కానీ గాజాలో పరిస్థితి మాత్రం వేరేలా ఉందా? హమాస్‌ను నిరాయుధం చేసి యుద్ధాన్ని ముగించే ప్లాన్ ముందుకు వెళ్తోందని ట్రంప్ చెబుతున్నా, గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగిన దాడుల్లో 18 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు Reuters తెలిపింది. ఇజ్రాయెల్ మాత్రం హమాస్ ముందుగా ఆయుధాలు వదలాలని అంటుండగా, హమాస్ ఇజ్రాయెల్ ముందుగా దాడులు ఆపి వెనక్కి వెళ్లాలని చెబుతోంది. అంటే పీస్ ప్లాన్ ఉన్నా.. “ఫస్ట్ ఎవరు?” అన్న దగ్గరే పెద్ద సమస్య కొనసాగుతోంది.



