ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రపంచమంతా ‘వెల్‌నెస్ వీకెండ్’!

ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంచే ‘వరల్డ్ వెల్‌నెస్ వీకెండ్’ మళ్లీ జరగబోతోంది. సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. భారత్‌లోనూ హోటళ్లు, వెల్‌నెస్ కేంద్రాలు, యోగా సంస్థలు, స్పాలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నాయి. ఏటా.. పిల్లలు, యువత, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజలూ ఇందులో పార్టిస్పేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా యోగా, ధ్యానం, ఫిట్‌నెస్, ఆరోగ్యకరమైన ఆహారంపై వర్క్‌షాప్‌లు, ఆయుర్వేదం, ఫారెస్ట్ ట్రెక్స్ కార్యక్రమాలు ఉంటాయి.



