హెల్మెట్ సేఫ్టీ ఓకే.. మరి హెల్త్ సేఫ్టీ?

హెల్మెట్ పరిశుభ్రతపైనా శ్రద్ధ పెట్టాలని డాక్టర్లు సూచిస్తున్నారు. తల చెమట, నూనె, హెయిర్ ప్రొడక్ట్స్, దుమ్ము.. హెల్మెట్ ప్యాడింగ్‌లో పేరుకుపోవడంతో.. దుర్వాసన, దురద, మంట వంటివి రావొచ్చు. ముఖ్యంగా వేసవిలో చెమట, వర్షాకాలంలో తేమతో సమస్యే. దుర్వాసన రాగానే పెర్ఫ్యూమ్, డియోడరెంట్ స్ప్రే చేయడం కాకుండా ప్యాడింగ్‌ను శుభ్రం చేయాలి. లైనర్, ప్యాడ్స్‌ను మైల్డ్ సబ్బు లేదా షాంపూతో కడిగి, నీడలో ఆరబెట్టాలి. ప్రయాణం తర్వాత హెల్మెట్‌ను గాలి తగిలేలా ఉంచాలి. భద్రతతో పాటు హెల్మెట్ శుభ్రత కూడా ముఖ్యమే.!



