అనాథ బాలికను చంపిన ఆటో డ్రైవర్

AP: విశాఖ కంచరపాలెంకి చెందిన ఆటో డ్రైవర్ సురేష్, ఓ అనాథ బాలికను గర్భిణీగా ఉన్న తన భార్యకు సాయంగా ఉంటుందని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. సురేష్ భార్యకు పాప పుట్టాక, బాలిక తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. ఇద్దరి మధ్య గొడవ జరిగి కోపంతో ఆమెను కొట్టి చంపి శవాన్ని ట్రాలీ బ్యాగులో దాచి, రైలెక్కి ఒడిశా రాష్ట్రం రాయగడ దగ్గర ఎవరూ లేని చోట పడేశాడు. 3రోజుల తర్వాత వాసన రావడంతో స్థానికులు పోలీసులకు చెప్పారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఒడిశా పోలీసులు సురేష్‌ను పట్టుకున్నారు.



