← Back to news

భూపాలపల్లిలో చైన్ స్నాచింగ్

By Royal Praveen· 24 Aug 2026· భూపాలపల్లి

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీనగర్‌లో పట్టపగలే దొంగతనం చేసే ప్రయత్నం జరగడంతో ప్రజలు భయపడిపోయారు. సోమవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సాంబరెడ్డి, అహల్య దంపతులను దొంగలు వెంబడించారు. అహల్య మెడలోని బంగారు గొలుసును ఓ దొంగ లాక్కునేందుకు చూడగా, అది తెగి ఆమె మెడలోనే పడిపోవడంతో ప్లాన్ ఫెయిల్ అయింది. వెంటనే ఆ దొంగ వీధి చివర బైక్‌పై సిద్ధంగా ఉన్న ఇంకో వ్యక్తితో కలిసి పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి CCTV కెమెరాల్లో రికార్డయింది.

More in Local