రైతులకు న్యాయం చేయాలి

TG : సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలో ఉన్న ఫర్టిలైజర్ షాపుల్లో రైతులకు అన్యాయం జరుగుతోందని కూటిగల్, రెడ్యానాయక్ తండా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి షాపులో ఎరువుల ధరల బోర్డు పెట్టాలని, కొన్న మందులకు రసీదు తప్పకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రజావాణిలో MPDOతో పాటు వ్యవసాయ అధికారికి రైతులు వినతిపత్రం అందజేశారు.



