WhatsAppలో ‘NO’ అని రిప్లై ఇస్తున్నారా? జాగ్రత్త!
TG: వాట్సాప్‌లో ‘NO’ అని రిప్లై ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలని పోలీస్ కమిషనర్ V.C సజ్జనార్ సూచించారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్ల పేరుతో వచ్చే మెసేజ్‌లను నమ్మొద్దని, డౌట్‌ఫుల్ లింక్స్, ఫైళ్లను ఓపెన్ చేయొద్దని హెచ్చరించారు. బ్యాంక్‌లో డబ్బులు కట్ అయ్యాయంటూ మెసేజ్ వస్తే అధికారిక బ్యాంక్ యాప్‌లో చెక్ చేసుకోవాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని, <a href="https://cybercrime.gov.in/">Cyber Crimeలో</a> ఫిర్యాదు చేయాలని తెలిపారు.


