రాముడు, రావణుడిపై రాజకీయాలు మానుకోండి: బండి సంజయ్

TG: CM రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై రేవంత్ రెడ్డి ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారని అన్నారు. ఒకసారి కాంగ్రెస్‌ను రాముడితో, BJPని రావణుడితో పోలుస్తారని, మరోసారి BJP ‘జై శ్రీరామ్’ అంటుందని, ‘హర హర మహాదేవ్’ అనదని చెబుతారని విమర్శించారు. ముస్లింలు, కాంగ్రెస్ ఒక్కటేనంటూ కామెంట్స్ చేస్తున్నారని ఆరోపించారు. కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసే రాజకీయాలు కాంగ్రెస్ మానుకోవాలని బండి సంజయ్ అన్నారు.

