సాదిక్‌ను కాకినాడ తీసుకొచ్చిన పోలీసులు

AP: పిఠాపురం పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యపై ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సాదిక్‌ను పోలీసులు కాకినాడ తీసుకొచ్చారు. మీరట్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం అతడిని కాకినాడకు తరలించారు. ప్రస్తుతం సర్పవరం పోలీసుల అదుపులో ఉన్న సాదిక్‌ను సోమవారం కాకినాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పూర్తి విచారణ కోసం పోలీస్ కస్టడీ కోరనున్నట్లు సమాచారం.



