NHM ఉద్యోగులకు హరీశ్రావు మద్దతు
సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్న NHM ఉద్యోగులకు మాజీ మంత్రి హరీశ్రావు సంఘీభావం తెలిపారు. ఉద్యోగాలను చాయ్ తాగినంత సమయంలోనే క్రమబద్ధీకరిస్తామని చెప్పిన CM రేవంత్రెడ్డి ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. NHM, ఆయుష్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని, పెండింగ్ జీతాలు, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల డిమాండ్ల సాధనకు BRS అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


