మద్యం మత్తులో అంబులెన్స్ డ్రైవర్

TG: హైదరాబాద్‌లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. గచ్చిబౌలి ఆల్ సబా హోటల్ సమీపంలో రాయదుర్గం పోలీసులు తనిఖీలు నిర్వహించగా, అంబులెన్స్ డ్రైవర్ రాఘవేంద్ర మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో అతనికి ఏకంగా 324 రీడింగ్ నమోదవడంతో పోలీసులు షాకయ్యారు. రోగుల ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్‌ను ఇంత ప్రమాదకర స్థితిలో నడపడం తీవ్ర నిర్లక్ష్యంగా పోలీసులు పేర్కొన్నారు. డ్రైవర్‌పై డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదు చేసి అంబులెన్స్‌ను సీజ్ చేశారు.



