నెక్కొండ SIపై సస్పెన్షన్ వేటు

TG: వరంగల్ కమిషనరేట్ పరిధిలోని నెక్కొండ SI మహేందర్‌ను అవినీతి ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేశారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో కమిషనర్ శ్వేత క్రమశిక్షణా రాహిత్యం కింద సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కమిషనర్ స్పష్టం చేశారు. పోలీసు శాఖలో పారదర్శకత పెంపొందించడంతో పాటు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



