← Back to news

పేదల ఇళ్లకు డబ్బులు ఎందుకు? : తలసాని

By dk· 15 Aug 2026· హైదరాబాద్
పేదల ఇళ్లకు డబ్బులు ఎందుకు? : తలసాని

TG: పేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మాజీ మంత్రి‌ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత BRS ప్రభుత్వం పేదల ఆత్మగౌరవం కోసం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించిందని గుర్తుచేశారు. GHMC పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టి, 69 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ల కోసం డబ్బులు వసూలు చేయడం సరికాదని విమర్శించారు. లబ్ధిదారుల నుంచి రూ.10 వేలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

More in TG