CJP నిరసనతో ఢిల్లీలో అలర్ట్

అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర CJP నిరసన జరగనుంది. దీంతో పోలీసులు హోటళ్లు, గెస్ట్‌హౌస్‌ల్లో చెకింగ్ చేస్తున్నారు. అక్టోబర్ 8 నుంచి 11 మధ్య రూమ్స్ తీసుకున్నవారి ఐడీలు, బుకింగ్స్ చెక్ చేస్తున్నారు. గ్రూపులుగా వచ్చేవారిపైనా ఫోకస్ పెట్టారు. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లోనూ చెకింగ్ చేస్తున్నారు. CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఎక్కడ ఉంటున్నారో గుర్తించే బాధ్యతను స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ టీమ్‌లకు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు అప్పగించినట్లు తెలిపారు.



