← Back to news

గోవా ఎయిర్‌పోర్టులో పరీక్షల మోసం గుట్టురట్టు!

By Sharmila· 1h ago· X
గోవా ఎయిర్‌పోర్టులో పరీక్షల మోసం గుట్టురట్టు!

గోవా ఎయిర్‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో CISF తనిఖీల్లో ఇద్దరు ప్రయాణికులు అనుమానాస్పద ఎలక్ట్రానిక్ పరికరాలతో పట్టుబడ్డారు. వారి వద్ద 4 ఎలక్ట్రానిక్ పరికరాలు, 3 సిమ్ కార్డులు, 5 బ్లూటూత్ ఇయర్‌పీస్‌లు, హాల్‌టికెట్, ఆధార్ కార్డులు లభించాయి. IIT గోవాలో జరిగిన నియామక పరీక్షలో వేరొకరి పేరుతో పరీక్ష రాసినట్లు అనుమానం వ్యక్తమైంది. ఇద్దరినీ పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి ఎంక్వయిరీ చేస్తున్నారు.

More in National