← Back to news

CEC జ్ఞానేష్‌పై మరో ఆరోపణ!

By Lokesh· 1h ago· Thehindu
CEC జ్ఞానేష్‌పై మరో ఆరోపణ!

కేరళ మాజీ చీఫ్ సెక్రటరీ జిజి థామ్సన్ కీలక విషయం చెప్పారు. 2016లో IAS అధికారిగా ఉన్న, ఇప్పటి CEC జ్ఞానేష్ కుమార్.. తనను 2019 లోక్‌సభ ఎన్నికల్లో BJP టికెట్‌పై 'పతనంతిట్ట' నుంచి పోటీ చేయాలని అడిగారని చెప్పారు. గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పారని థామ్సన్ తెలిపారు. అయితే తాను అప్పుడు అందుకు ఒప్పుకోలేదని చెప్పారు. ఈ ఆరోపణపై జ్ఞానేష్ కుమార్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందనా రాలేదు. జ్ఞానేష్ BJP కోసం పనిచేస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు థామ్సన్ కామెంట్స్ బలాన్నిస్తున్నాయి.

More in National