పిల్లల పెంపకంలో పేరెంట్స్ ‘పైలట్’లా ఎందుకుండాలంటే?

పిల్లల ప్రతి సమస్యను పేరెంట్సే పరిష్కరించకూడదని సైకాలజిస్ట్ డా. బెక్కీ కెన్నడీ సూచించారు. పిల్లల భావాలను అర్థం చేసుకుంటూనే.. కొన్ని సమస్యలను వాళ్లే ఎదుర్కొనేలా చేయాలన్నారు. విమానం నడిపే పైలట్‌లా.. పేరెంట్స్ పిల్లలకు దారి చూపాలని చెప్పారు. ఇలా చేయడం వల్ల చిన్నప్పటి నుంచే నిరాశ, ఈర్ష్య వంటి భావాలను ఎదుర్కోవడం నేర్చుకుని.. భవిష్యత్తులో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.



