వాటర్ మిలన్ తింటున్నారా? ఇవి జాగ్రత్త...

సమ్మర్ కదాని వాటర్ మిలన్ (పుచ్చకాయ) తింటున్నారా? అయితే మీరు ఈ సూచనలు తెలుసుకోండి. పుచ్చకాయపై ఉండే చారలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే అది పూర్తిగా తినడానికి సిద్ధమైందని, సహజంగా పండిందని అర్ధం. కాయను పైన తట్టినప్పుడు డీప్, హాలో సౌండ్ వినపడితే అది మంచిది.. అందులో పుష్కలంగా ఉండే నీరు వేసవి ఎండలకు మంచి రిలీఫ్..అనేక పోషకాలు పుష్కలంగా ఉన్న వాటర్ మిలన్ బెస్ట్ సమ్మర్ ఫ్రూట్. అయితే కాయ కొనేముందు దానిపై ఏవైనా ఇంజెక్షన్ మార్క్స్ ఉన్నాయేమో చూడండి.ఎందుకంటే దానిని కృత్రిమ పద్ధతుల్లో పండించి అమ్మేస్తున్నారు.



