← Back to news

ఆస్పత్రి ముందు కుటుంబసభ్యుల ఆందోళన

By Mohammed Hafeez· 22 Aug 2026
ఆస్పత్రి ముందు కుటుంబసభ్యుల ఆందోళన

TG: మూడు నెలల పసికందు మృతి చెందడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం చేనుగొనిపల్లి గ్రామానికి చెందిన హరీష్, శ్రావణి దంపతుల మూడు నెలల పాపను అనారోగ్యంతో గద్వాలలోని సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చికిత్స పొందుతున్న సమయంలో పాప మృతి చెందిందని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని వారు ఆరోపించారు. పాప మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

ఆస్పత్రి ముందు కుటుంబసభ్యుల ఆందోళన
ఆస్పత్రి ముందు కుటుంబసభ్యుల ఆందోళన

More in Local