స్కూల్లో గోడ కూలి విద్యార్థి మృతి

AP : పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ హైస్కూల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. డీటీకి వినతిపత్రం ఇచ్చారు. స్కూల్ గోడ ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి చనిపోవడం చాలా బాధాకరమని, అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని SFI నేతలు అన్నారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్లో ప్రాథమిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడంపై మండిపడ్డారు.



