వదిన తల నరికి చెట్టుకు వేలాడదీసిన మరిది!

బిహార్‌లోని జెహనాబాద్ జిల్లా ఇమాద్‌పూర్‌లో ఇంటికి వచ్చిన మరిది కునాల్ కుమార్, వంట ఆలస్యమైందనే కోపంతో వదిన అన్షుదేవి (25)తో గొడవపడ్డాడు. ఆవేశానికి లోనైన కునాల్ కుమార్ తన వదినపై దాడి చేసి గొడ్డలితో నరికి చంపాడు. అంతటితో ఆగకుండా, నరికిన తలను ఇంటి సమీపంలోని మర్రిచెట్టుకు వేలాడదీశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, పోస్టుమార్టం నివేదిక అనంతరం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.



