బాబోయ్.. రోజుకు 12 వేల లీటర్ల నకిలీ పాల తయారీ!
రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ పట్టణంలో పోలీసులు నకిలీ పాల తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. గుర్జర్ కాలనీలోని చిన్న ఫ్యాక్టరీలో స్కిమ్డ్ మిల్క్ పౌడర్, పామ్ ఆయిల్ వంటి పదార్థాలతో రెండేళ్లుగా నకిలీ పాలు తయారు చేస్తున్నారు. పోలీసులు 4,000 లీటర్ల నకిలీ పాలు నింపిన ట్యాంకర్‌ను సీజ్ చేశారు. ఫ్యాక్టరీ నుంచి రోజుకు 12,000 లీటర్ల నకిలీ పాలు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు సరఫరా అవుతున్నాయి. ప్రధాన నిందితుడు భగీరథ్ గుర్జర్ పరారీలో ఉన్నాడు.


