రిమ్‌పైనే 40 కిలోమీటర్లు.. స్కార్పియో ఛేజ్
అస్సాంలోని కర్బీ అంగ్‌లాంగ్‌లో ఓ చిన్నారిని ఢీకొట్టిన బ్లాక్ స్కార్పియో ఆగకుండా వెళ్లిపోయింది. పోలీసులు వెంటపడుతుండగా టైర్ పూర్తిగా పేలిపోయినా డ్రైవర్ కారును ఆపలేదు. టైర్ లేకపోయినా మెటల్ రిమ్‌పైనే దాదాపు 40 కిలోమీటర్లు వెళ్లాడు. దారిలో కొన్ని వాహనాలను కూడా ఢీకొట్టాడు. చివరకు నాగావ్‌లో పోలీసులు, స్థానికులు చుట్టుముట్టడంతో కారు ఆగింది. డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


