భార్య హత్య.. లైవ్‌లో చూపించిన భర్త!

కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్య భాగ్యశ్రీని కర్రతో బాది, దుపట్టాతో ఉరేసి దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా, ఉరికి వేలాడుతూ ప్రాణాల కోసం పోరాడుతున్న భార్యను ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి లైవ్‌లో చూపించాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించినప్పటికీ, పోలీసులు వచ్చేసరికి భాగ్యశ్రీ చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



