బాలికపై మేనమామ, సోదరుల లైంగిక దాడి

TG: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఉన్న మేనమామ, వరసకు సోదరులయ్యే ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్రకు చెందిన బాలిక(13)పై అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రులు మరణించడంతో అమ్మమ్మ వద్ద ఉంటూ హాస్టల్‌లో చదువుకుంటుంది. సెలవుల్లో ఇంటికి వచ్చిన ఆమె ఒంటరిగా ఉండటం చూసి లైంగిక దాడి చేశారు. పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.



