← Back to news

పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి

By DeeKay· 17 Jun 2026· Hmtvlive· జనగాం జిల్లా
పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి

TG: జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఒగ్గు మహేష్ తన కుటుంబసభ్యులతో రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్నాడు. చిన్నారి మధుస్మిత(4) ను పాము కాటేసింది. వెంటనే పాపను తల్లిదండ్రులు జనగాం, ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించగా మృతి చెందింది. ఆడుతూ, పాడుతూ మంచిగా చదువుకుంటూ ఉన్న పాప చనిపోవడంతో ఒగ్గు మహేష్ తీవ్ర దుఃఖానికి లోనయ్యాడు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.