బెంగళూరులో కలకలం..ఆసుపత్రులకు నకిలీ మందులు?

బెంగళూరులో నకిలీ క్యాన్సర్ మందులు, ICU ఇంజెక్షన్ల సరఫరాపై SIT విచారణ చేపట్టింది. దాదాపు 50 శాతం తక్కువ ధరకు మందులు ఇస్తామని చెప్పి ఆసుపత్రులు, క్లినిక్‌లకు సరఫరా చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఎక్స్‌పైరీ అయిన మందులను కొత్త ప్యాకింగ్, నకిలీ లేబుళ్లతో విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. 90కి పైగా ఆసుపత్రులు, క్లినిక్‌లకు ఇవి చేరాయా అనే దానిపై విచారణ కొనసాగుతోంది. రూ.5 కోట్ల విలువైన అనుమానిత నకిలీ మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.



