← Back to news

ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ మలక్కా జలసంధి !

By aravinda nyayapati· 15 Apr 2026· Telugu Report· Hyderabad
ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ మలక్కా జలసంధి !

హార్మూజ్ జలసంధిపై పట్టుసాధించలేక ఆపసోపాలు పడుతున్న అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మలక్కా జలసంధిపై కన్ను వేశారు. ఇండోనేషియాతో అమెరికా కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ఇందులో భాగమేనని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా విమానాలకు ఇండోనేషియా గగనతలంలో ప్రవేశం లభిస్తుంది, ఇది మలక్కా జలసంధిపై నిఘా ఉంచేందుకు అమెరికాకు సాయపడుతుంది. ఇండోనేషియా,మలేసియా, సింగపూర్ మీదుగా సాగే ఈ జలసంధి ద్వారా ప్రపంచ వాణిజ్యంలో 40శాతం రవాణా అవుతుంది. చైనా తన ఇంధన అవసరాల కోసం ఈ మార్గంపైనే ఆధారపడుతుంది. భారత్‌కు చెందిన అండమాన్ నికోబార్ దీవులు ఈ జలసంధికి సమీపంలో ఉండటం వల్ల, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అమెరికా-భారత్ సహకారం మరింత పెరిగి, చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునే అవకాశం ఉంది.

More in World