2036 ఒలింపిక్స్ ఆతిథ్యమే భారత్ లక్ష్యం!

భారతదేశం క్రీడారంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతోందని PM నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు చెన్నెలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. క్రీడారంగంలో దేశ యువత సాధిస్తున్న పురోగతి, రాబోయే మెగా ఈవెంట్ల గురించి మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 2036 ఒలింపిక్ గేమ్స్ ఆతిథ్య హక్కులను దక్కించుకోవడమే లక్ష్యంగా ఇండియా ముందుకు కొనసాగుతోందని స్పష్టం చేశారు.


