మాజీ సీఎం పినరయి విజయన్‌కు మరో చిక్కు

కేరళ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత పినరయి విజయన్‌పై ఉన్న CMRL కేసు కొత్త టర్న్ తీసుకుంది. విజయన్, ఆయన కుమార్తె వీణ, అల్లుడు మహ్మద్ రియాస్‌పై FIR నమోదు చేయాలని కేరళ పోలీసులను ED కోరింది. CMRL నుంచి వీణకు చెందిన ‘Exalogic Solutions’ సంస్థకు రూ.2.78 కోట్లు చెల్లించారని తెలిపింది. అవి సేవలకు కాకుండా ముడుపులుగా ఇచ్చినట్లు ED ఆరోపిస్తోంది. ఈ కేసులో ED సేకరించిన ఆధారాలను కేరళ DGPకి పంపించి, Prevention of Corruption Act కింద కేసు పెట్టాలని కోరింది.


