పెళ్లైన కూతురికి పేరెంట్స్ ఆస్తిలో వాటా ఉంటుందా?

2005 నాటి హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం పూర్వీకుల ఆస్తిలో.. కొడుకుతో సమానంగా కూతురికి కూడా హక్కు ఉంటుంది. పెళ్లయినా సరే ఆ హక్కు కోల్పోదు. తల్లిదండ్రులు.. ఆస్తిని కొడుకుకి మాత్రమే రాస్తే, కూతురు కోర్టుకు వెళ్లి వాటా పొందవచ్చు. కానీ తల్లిదండ్రులు స్వయంగా సంపాదించిన ఆస్తిని వారు గిఫ్ట్ లేదా వీలునామా ద్వారా కొడుకుకి మాత్రమే ఇస్తే, కూతురికి ఎలాంటి హక్కూ ఉండదు. వీలునామా లేకుండా మరణిస్తే.. చట్టబద్ధ వారసులందరికీ సమాన వాటా లభిస్తుంది.


