← Back to news

అంధత్వ నివారణపై స్కూల్ పిల్లలకు అవగాహన

By Mohan Digitals· 6d ago

రాజాం మండలం రాజాం సన్ స్కూల్ ఆవరణలో అంధత్వ నివారణ కార్యక్రమాల్లో భాగంగా పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్నియా సేకరణ, కంటి చూపు మందగించే వారికి చికిత్సలు చేసి అంధత్వాన్ని నివారించడానికి కార్యక్రమాలు చేస్తున్నామని రాజాం రెడ్‌క్రాస్ అధ్యక్షుడు కొత్తా సాయిప్రశాంత్ కుమార్ అన్నారు. రాజాం రెడ్‌క్రాస్ ప్రతినిధి చైతన్య కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 650 మంది ఇప్పటివరకూ నేత్రదానం చేస్తే రాజాం నుండే 150 మంది నేత్రదానం చేశారని తెలిపారు.

More in Local