రీ సర్వేతో భూవివాదాలకు చెక్

తెలంగాణలో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే రీ సర్వే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలి దశలో 2,240 గ్రామాల్లో రీ సర్వే కొనసాగుతోందని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్రామసభలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి గ్రామంలో అధికారులు అందుబాటులో ఉండి సందేహాలు నివృత్తి చేయాలని, కలెక్టర్లు వారానికోసారి పురోగతిని సమీక్షించాలని సూచించారు. అత్యాధునిక సాంకేతికతతో ప్రతి భూమికి కచ్చితమైన హద్దులు గుర్తించి ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయిస్తామని చెప్పారు.



