← Back to news

నాన్న.. నిన్ను నడిపించే హీరో!

By Sharmila· 1d ago· X

తండ్రీకొడుకుల అనుబంధం గురించి తెలిపే ఓ వీడియో వైరల్‌గా మారింది. UPPCS ఇంటర్వ్యూకు వెళ్తున్న ఓ యువకుడికి ఆయన తండ్రి ప్రేమగా జుట్టు దువ్వుతున్న ఇది. ఇంటర్వ్యూకు ముందు కొడుకును దగ్గరుండి చూసుకుంటున్న తండ్రి ప్రేమ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. జీవితంలో తండ్రి అండగా ఉంటే ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని సాధించవచ్చని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల అనుబంధం ఎంతోమందికి స్ఫూర్తిని అందిస్తోంది. మీరేమంటారో కామెంట్ చేయండి.

More in Viral