ఆఫ్రికాలో వేగంగా స్ప్రెడ్ అవుతున్న ఎబోలా!

ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి కొనసాగుతోంది. DR కాంగోలో పరిస్థితి తీవ్రంగా ఉంది. అక్టోబర్ 4 వరకు 8,603 కేసులు, 4,148 మరణాలు నమోదయ్యాయి. కెన్యాలో తొలిసారి ఎబోలా కేసు నమోదైంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి చనిపోయాడు. అతడిని కలిసిన 10 మందిని అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు. మరో 57 మంది కాంటాక్ట్స్‌ను గుర్తించే పనిలో ఉన్నారు. దీంతో ఎబోలా ప్రపంచ దేశాలకు వ్యాప్తిచెందే ఆనవాలు కనిపిస్తున్నాయి.


