1997 పేపర్ లీక్.. లాఠీ దెబ్బలు తిన్న ధర్మేంద్ర ప్రధాన్!

NEET పేపర్ లీక్ వల్ల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ తీవ్రమైంది. అయితే, 1997లో ఒడిశాలో పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా అప్పట్లో ABVP విద్యార్థి నేతగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ భారీ నిరసనలు తెలిపిన పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెక్రటేరియట్ ముట్టడి సమయంలో పోలీసుల లాఠీచార్జ్‌లో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకప్పుడు పేపర్ లీకులపై పోరాడి లాఠీ దెబ్బలు తిన్న ఆయనే, ఇప్పుడు అదే తరహా వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.




